Saturday, April 27, 2024

తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

లిక్కర్ కేసులో అరెస్టైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. 10 రోజుల కస్టడీ ముగియడంతో ఇడి అధికారులు మంగళవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చారు. కవితను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును కోరారు ఇడి అధికారులు. దీంతో రిమాడ్ కు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితకు రిమాండ్ విధించింది. దీంతో మరికాసేపట్లో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు పోలీసులు.

మరోవైపు, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్లు ఢిల్లీ ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. కాబట్టి ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ పై విచారణ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News