Wednesday, July 9, 2025

ఇది కేవలం ట్రైలర్ మాత్రమే: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బిజెపి పార్టీలు చేస్తున్న మోసానికి నిరసనగా, బిసి బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైల్ రోకోను నిర్వహిస్తామని హెచ్చరించారు.

బిసి రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంఎల్‌సి కవిత మాట్లాడారు. రైల్ రోకోకు మద్ధతు, బిసి రిజర్వేషన్ల అమలు విషయంలో అన్ని పార్టీలకు లేఖలు రాస్తానని తెలిపారు. తాము ఒబిసిని అని చెప్పుకునే ప్రధాని మోదీకి ఆ వర్గాలకు న్యాయం చేసే అవకాశం లభించిందని, తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో అమలవుతున్న 69 శాతం రిజర్వేషన్ల తరహాలో తెలంగాణ బిసి బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని ప్రతిపాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News