Friday, March 29, 2024

ఉద్యోగ కల్పనలో మోడీ వైఫల్యం

- Advertisement -
- Advertisement -

మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వ పాలన సాఫీగా సాగిపోతున్నదని, దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చేయబడుతున్న ప్రచారం డొల్లతనాన్ని గత నాలుగు సంవత్సరాలగా పెరుగుతున్న నిరుద్యోగం బట్టబయలు చేస్తున్న ది. దాన్ని రుజువు చేసే విధంగా 2018 -19లో వెలువడిన నివేదికలు తెలియచేస్తున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం మెజారిటీ భారత ప్రజలు ఉపాధి అవకాశాల కొరతను చాలా పెద్ద సమస్యగా భావిస్తున్నారు. సుమారుగా 18.6 మిలియన్ల మంది భారతీయులు నిరుద్యోగులగా ఉన్నారు. మరో 393.7 మిలియన్ల ప్రజలు చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వ ఏజెన్సీ నిర్వహించిన ఉపాధి మొదటి సర్వే నివేదిక ప్రకారం దేశంలో 17-జులై 2017లో సాధారణ నిరుద్యోగ స్థితి 6.1% ఉంది.

ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కన్నా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ రంగాలను ఎక్కువ సంక్షోభం లోకి నెడుతున్నాయి. రైతాంగ భూముల ను కార్పొరేట్ల స్వాధీనం చేయటానికి, రైతాంగం పండించే పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించకపోవటం, ఎరువుల ధర ల నిర్ణయం నుంచి తప్పుకుని పరిశ్రమాధిపతులకు అప్పగించటం, సేద్యపు ఖర్చులు పెరిగే విధానాలు అమలు జరపటం, సేద్యాన్ని నష్టదాయకంగా మార్చి సాగు నుంచి రైతాంగం వైదొలగేలా చేయటం, ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశ్రమలను ప్రైవేటీకరించటం లేదా అమ్మి వేయటం, అనేక పరిశ్రమలను మూసివేటం చేస్తున్నది.

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను సంక్షోభంలోకి నెట్టటమే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కుదించుకుపోయి నిరుద్యోగం పెరుగుతూ వస్తున్నది. అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయంలో ప్రస్తుతం అవసరంలేని మితిమీరిన యాత్రీకరణ గ్రామీణ ఉపాధి పనులను 150 రోజుల నుండి 80 రోజులకు పడిపోయేలా చేసింది. పరిశ్రమలు మూసివేత, అమ్మివేత వలన లక్షలాది కార్మికులు ఉద్యోగాలు కోల్పోవటమే కాకుండా వాటి ఆధారంగా బతికే పట్టణపేదలు ఉపాధి కోల్పోతున్నారు. వీరంతా నిరుద్యోగులుగా మిగులుతున్నారు.

ప్రపంచంలో ఏ దేశంలో లేని అపారమైన యువశక్తి భారత దేశంలో ఉంది. నేటి దేశ జనాభాలో 90 కోట్ల మంది పని చేసే వయస్సుగల వారే. వీరందరికీ ఉపాధి కల్పిస్తే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గత పాలకులకు నేటి పాలకులకు ఆ విధానాలు లేకపోవటం వలన యువశక్తి నిర్వీర్యమై దేశ అభివృద్ధి తిరోగమన దిశలో సాగుతున్నది. ఉద్యోగ, ఉపాధి కల్పన లేక యువత నిరాశ, నిస్పృహకులోనై పెడ మార్గంలో పయనించటం, ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతున్నది. మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ 2014 సాధారణ ఎన్నికల సందర్భంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసింది. నిరుద్యోగంతో బతుకు తెరువు కానరాని యువత దానికి ఆకర్షితులై ఎన్‌డిఎకు ఓట్లు వేసి మోసపోయారు. ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన మాట మర్చిపోయి, ఉద్యోగ, ఉపాధిని హరించే విధానాలు చేపట్టింది. ఫలితంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రవీణ్ సిన్హా 2013 నివేదిక ప్రకారం కార్మిక శక్తిని భారత ప్రభుత్వం మూడు వర్గాలగా విభజించింది. వ్యవసాయ కూలీలతో కలసి గ్రామీణ రంగం, ప్యాక్టరీలు, సేవా పరిశ్రమల కార్మికులను కలిగి ఉన్న పట్టణ అధికారిక రంగం, పట్టణ అనధికార రంగం. భారతీయ కార్మిక రంగం, అనాధికారిక రంగాలు 2011లో 93% ఉపాధి పొందారు. 1980 -2010 మధ్య భారత ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం నిరుద్యోగం 2.8% గా ఉంది. 1983లో దేశంలో నిరుద్యోగుల సంఖ్య 7.8 మిలియన్లు ఉండగా, 2004-05 నాటికి 12.3 మిలియన్లకు పెరిగింది.

మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వ పాలన సాఫీగా సాగిపోతున్నదని, దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చేయబడుతున్న ప్రచారం డొల్లతనాన్ని గత నాలుగు సంవత్సరాలగా పెరుగుతున్న నిరుద్యోగం బట్టబయలు చేస్తున్న ది. దాన్ని రుజువు చేసే విధంగా 2018 -19లో వెలువడిన నివేదికలు తెలియచేస్తున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం మెజారిటీ భారత ప్రజలు ఉపాధి అవకాశాల కొరతను చాలా పెద్ద సమస్యగా భావిస్తున్నారు. సుమారుగా 18.6 మిలియన్ల మంది భారతీయులు నిరుద్యోగులగా ఉన్నారు. మరో 393.7 మిలియన్ల ప్రజలు చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వ ఏజెన్సీ నిర్వహించిన ఉపాధి మొదటి సర్వే నివేదిక ప్రకారం దేశంలో 17-జులై 2017లో సాధారణ నిరుద్యోగ స్థితి 6.1% ఉంది. ఈ కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పురుష నిరుద్యోగ యువత శాతం 17.4% నుంచి 18.7% కి పెరిగింది. 2019 -20లో జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) విడుదల చేసిన నివేదికలో 2021 జనవరి- మార్చి త్త్రెమాసికంలో పట్టణ నిరుద్యోగం 9.3% ఉంది.

నిరుద్యోగం, అప్పుల వలన ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 2022 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్, రాజ్యసభ సమావేశాల్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇచ్చిన సమాధానం అందుకు గీటురాయిగా ఉంది. ఆయన సమాధానంలో 2018- 20 సంవత్సరాల మధ్య నిరుద్యోగం, అప్పుల కారణంగా దేశంలో 25 వేల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందులో నిరుద్యోగం కారణంగా 9,140 మంది, అప్పుల కారణంగా 16,091 మంది ఆత్మహత్య ల జాబితాలో ఉన్నారు.2020లో కొవిడ్ కారణంగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని ఇవన్నీ జాతీయ క్రైమ్ బ్యూరో ఇచ్చిన లెక్కల ప్రకారం తెలియచేస్తున్నానని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సంవత్సరం గడచిన 6 నెలల కాలంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ది. జూన్ నెలలో 7.80% నుంచి 6.89%కి నిరుద్యోగం తగ్గిందని లెక్కలు చెబుతున్నది. ఈ మాసాల్లో దేశ వ్యాపితంగా వ్యవసాయ పనులు దొరుకుతాయి. దీన్ని చేపెట్టి నిరుద్యోగం తగ్గుముఖం పట్టినట్లుగా మోడీ ప్రభుత్వం చెప్పటం ప్రజలను మోసగించట మే. ఈ పనులు ముగియగానే ఉపాధి మందగించి నిరుద్యోగం పెరుగుతున్నది.

నిరుద్యోగ శాతం పెరగడాన్ని మోడీ ప్రభుత్వం చెప్పే కారణం చాలా విచిత్రంగా ఉంది. యువత చదువులకు మళ్లటం వలన, పిల్లలను, వృద్ధులను చూసుకోవాల్సిన అవసర వలన కార్మికులు పని ప్రదేశాలను విడిచిపెట్టారు తప్ప నిరుద్యోగ తీవ్రత వల్ల కాదని కేంద్ర ప్రభుత్వ పాలకులు చెబుతున్నారు. ఇది సమస్యను పక్క దారి పట్టించటమే. సామ్రాజ్యవాద, బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గ ప్రయోజనాలు కాపాడే మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించదు, పరిష్కరించలేదు. గ్రామీణ ప్రజలకు విప్లవ భూ సంస్కరణల ద్వారా భూ పంపిణీ చేయకుండా, దేశీయ పారిశ్రామిక విధానాలు అమలు జరిపి ప్రజల అవసరాలు తీర్చే పరిశ్రమలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ప్రజలకు ఉద్యోగ, ఉపాధి లభించదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. అందుకోసం యావన్మంది గ్రామీణ, పట్టణ ప్రజలు ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News