Sunday, April 28, 2024

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయని మోడీ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను ‘భర్తీ చేయడం లేదు’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం విమర్శించారు. యువతకు ఉద్యోగాలకు ‘తిరిగి అవకాశాల కల్పన’కు ఇండియా కూటమి తీర్మానించిందని రాహుల్ ప్రకటించారు. ఉద్యోగాలు ఇవ్వరాదన్నది ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశంఅని రాహుల్ ఆరోపించారు. ‘దేశంలోని యువజనులారా ! ఒక విషయం గమనించండి. ఉద్యోగాలు ఇవ్వరాదన్నది నరేంద్ర మోడీ ఉద్దేశం. కొత్త ఉద్యోగాల సృష్టికి బదులు ఆయన కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా తిష్ట వేశారు’ అని రాహుల్ గాంధీ హిందీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డేటాను మనం పరిశీలించినట్లయితే 78 శాఖలలో 9.64 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమైన శాఖలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లయితే రైల్వేలలో 2.93 లక్షల ఉద్యోగాలు, హోమ్ మంత్రిత్వశాఖలో లక్షా 43 వేల ఉద్యోగాలు, రక్షణ మంత్రిత్వశాఖలో 2.64 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి’ అని రాహుల్ తెలిపారు. 15 ప్రధాన శాఖలలో 30 శాతం పైగా ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం చెబుతుందా అని ఆయన ప్రశ్నించారు. “బోగస్ గ్యారంటీల సంచీ’ భుజాన వేసుకుని తిరుగుతున్న ప్రధాని కార్యాలయంలో అత్యంత ముఖ్యమైన ఉద్యోగాలు అధిక సంఖ్యలో ఎందుకు ఖాళీగా ఉన్నాయి’ అని రాహుల్ అడిగారు.

శాశ్వత ఉద్యోగాలను ఒక భారంగా భావిస్తున్న బిజెపి ప్రభుత్వం అదే పనిగా కాంట్రాక్ట్ పద్ధతిని ప్రోత్సహిస్తోందని, ఆ పద్ధతిలో భద్రత గాని, గౌరవం గాని ఉండవని రాహుల్ ఆరోపించారు. ‘ఖాళీ ఉద్యోగాలు దేశంలోని యువత హక్కు. వాటి భర్తీకి మేము ఒక పటిష్ఠ ప్రణాళిక రూపొందించాం.యువత కోసం మూసివేసిన ఉద్యోగాల అవకాశాలను తిరిగి కల్పించాలని ఇండియా (కూటమి) నిశ్చయించింది’ అని ఆయన తెలిపారు. నిరుద్యోగిత అంధకారాన్ని చీల్చిన అనంతరం యువత భవిష్యత్తు ప్రజ్వరిల్లుతుందని రాహుల్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News