Saturday, April 27, 2024

మోడీయిజం నూతన ఫాసిజం

- Advertisement -
- Advertisement -

జీవితమంతా మోడీ తన గుంపులో భిన్నంగా ఉన్నారు. తన బృంద సభ్యులను మూర్ఖులను చేశారు. ఖాకీ నిక్కరు, సంఘ్ టోపీ, సాముకర్ర ధరించలేదు. సహచరుల దుస్తులకు భిన్న దుస్తులు ధరిస్తారు. సంఘ్ తాత్వికత పాటించారు. నియమాలు పాటించలేదు. స్వరాష్ట్రంలో సంఘ్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. జుట్లు ముడేసి తాను కుర్చీ ఎక్కే పనులు చేశారు. గుజరాత్‌లో మోడీ తంపులు పెడుతున్నారని, ఆయన్ను రాష్ట్రం బయటికి పంపమని సంఘ్ కేంద్ర కార్యాలయానికి విన్నపాలు అందాయి. గుజరాత్ నుండి సంఘ్ మోడీని బహిష్కరించింది. మోడీ ఢిల్లీలో అరుణ్ జైట్లీ ఇంటికి చేరారు.

జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ, ‘నమో’, ‘నరు’ ఇవి మోడీ ప్రాసల పద బంధాలు, పొట్టి అక్షరాల కొత్త పదాలు. ఉద్యమ రైతులను ఆందోళన జీవులని, అన్న దాతలను పరాన్నబుక్కులని ఎగతాళి చేశారు ప్రధాని. ఆందోళనలతో స్వాతంత్య్రం తెచ్చిన వీరులనూ అవమానించారు. ఆంగ్లేయులకు సహకరించి స్వాతం త్య్ర పోరాటాన్ని వెన్నుపోటు పొడిచిన వారి మాటలివి.రైతుల ఉద్యమంలో విదేశీ వినాశక భావజాలం (ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజి) ఉందని ఎఫ్.డి.ఐ.కి కొత్త భాష్యం చెప్పారు. హిట్లర్ వినాశక భావజాలమిది.

సంఘ్ నాయకులు ముసోలిని ఫాసిజాన్ని, హిట్లర్ నాజీయిజాన్ని మెచ్చి తెచ్చుకున్నారు. హిట్లర్ యూదులు నీచులని, విషపూరిత ప్రాణాంతక పరాన్నబుక్క బ్యాక్టీరియాలని తిట్టారు. ఆందోళనజీవుల నుంచి ప్రజలు జాగ్రత్తపడాలి. హిట్లర్ యూదులపై జర్మన్లను రెచ్చగొట్టారు. రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదంలో తమను యూదులతో, ప్రతిపక్షాలను హిట్లర్‌తో పోల్చారు మోడీ. రైతులను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించారు. నియంతృత్వాన్ని నిరూపించారు. 26.05.2006 ఉగ్రవాద చర్యలో కశ్మీర్‌లో ఆరుగురు గుజరాతీ యాత్రికుల మృతికి గులాంనబీ ఆజాద్ బాధ, మృతుల కుటుంబ సభ్యుల ఓదార్పును గుర్తు తెచ్చుకొని భావోద్వేగంతో కన్నీరు కార్చారు.

ఆజాద్‌ను పొగిడారు. ఇది నాటకమని, గుజరాతీ హిందు భక్తుల పట్లే మోడీ బాధని కొందరి భావం. గోధ్రా నరమేధం, మానభంగాలు, గో గూండాల చేతుల్లో ముస్లింల, దళితుల హత్యలు, 200ల ఉద్యమ రైతుల మరణం, దేశ బందీలో వలసదారుల బాధలు, హథ్రాస్ దళిత బాలిక దారుణ మానభంగ హత్య, జైళ్ళలో కష్టాలు పడుతున్న వృద్ధ సామాజిక నిర్మాతలు, విచారణ లేకుండా జైళ్ళలో మగ్గుతున్న ముస్లిం విద్యార్థుల, పాత్రికేయుల భవిష్యత్తు పట్ల మోడీకి బాధలేదు. రాజకీయ ఊగిసలాటలో మోడీ మెప్పుకు పొంగిన ఆజాద్, నా ముఖ్యమంత్రి బాధ్యత పట్ల సానుభూతి సరే. ప్రజల బాధలపై ఏడ్వండి. ఎగతాళి మాని సమస్యలను పరిష్కరించండి అని కార్పొరేట్ జీవి మోడీకి చెప్పడం మరిచారు.

జీవితమంతా మోడీ తన గుంపులో భిన్నంగా ఉన్నారు. తన బృంద సభ్యులను మూర్ఖులను చేశారు. ఖాకీ నిక్కరు, సంఘ్ టోపీ, సాముకర్ర ధరించలేదు. సహచరుల దుస్తులకు భిన్న దుస్తులు ధరిస్తారు. సంఘ్ తాత్వికత పాటించారు. నియమాలు పాటించలేదు. స్వరాష్ట్రంలో సంఘ్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. జుట్లు ముడేసి తాను కుర్చీ ఎక్కే పనులు చేశారు. గుజరాత్‌లో మోడీ తంపులు పెడుతున్నారని, ఆయన్ను రాష్ట్రం బయటికి పంపమని సంఘ్ కేంద్ర కార్యాలయానికి విన్నపాలు అందాయి. గుజరాత్ నుండి సంఘ్ మోడీని బహిష్కరించింది.

మోడీ ఢిల్లీలో అరుణ్ జైట్లీ ఇంటికి చేరారు. అన్నా‘వదినె’ల గదిలో దూరిన అర్జునుడు శిక్షా సమయంలో పాశుపతాస్త్రం సాధించినట్లు మోడీ రాష్ట్ర బహిష్కరణ వేళలో చాలా మేళ్ళు పొందారు. సంఘ్ జాతీయ నాయకత్వంతో పరిచయాలు పెంచుకున్నారు. మోడీతో విసిగిన జైట్లీ అతన్ని అమెరికాకు పంపారు. వాజపేయి పిలుపుపై తిరిగొచ్చిన మోడీని గుజరాత్ పంపారు. గుజరాత్ పార్టీ పనులు చూడమనగా ముఖ్యమంత్రిగా అయితేనే ఆ పని చేస్తానన్నారు. మోడీ ‘మోధ్’ వైశ్య కులానికి చెందినవారు. సంఘ్ అగ్ర కులస్థులతో పోటీకి అనుకూలంగా తనమోద్ఘంచి ఉపకులాన్ని, ప్రధాని వాజపేయి ఆశీస్సులతో బిసిగా మార్చుకున్నారు. అధికార స్థిరీకరణకు గోధ్రా నరమేధం, గుజరాత్ నకిలీ అభివృద్ధి నమూనా వగైరాల తదుపరి చరిత్ర తెలిసిందే.

కేశూభాయి పటేల్, శంకర్ సింఘ్ వాఘేలా వంటి సంఘీయుల అణచివేతలో గుజరాత్ బిజెపి గృహమంత్రి హీరేన్ పాండ్యా హత్యలో, రైతుల, ఆదివాసీల దమనకాండలో, ముస్లిం హత్యలు మానభంగాల్లో, కార్పొరేట్ల ప్రగతిలో గుజరాత్ నమూనా కనిపించింది. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ సొంత పార్టీ ప్రధానితో గోధ్రా నరమేధం రాజధర్మమేనని బుకాయించారు. మోడీయానికి ఆద్వాణీయులు మద్దతు పలికారు. మోడీ జన హననం ముస్లింల చర్యకు ప్రతి చర్యేనని, న్యూటన్ మూడవ సూత్రంతో, వాజపేయి మోడీయాన్ని సమర్థించారు. నాటి మోడీయ సమర్థకులను మోడీయ చతురత తొక్కేసింది. పాండవ పక్షం వహిస్తే ద్రౌపదికి ఆరవ భర్తను చేస్తానని కృష్ణుడు కర్ణున్ని అనైతికంగా ప్రలోభపెట్టారు. శూద్ర నైతిక లక్షణాల రాధేయుడు కృష్ణుని ఎత్తుగడలకు లొంగలేదు.

వెంకయ్య కృష్ణుడు మోడీ కొందరు మూల, ఆది వాసులను ప్రలోభాలతో లొంగ దీసుకున్నారు. ముస్లిం వ్యతిరేక చర్యల్లో తనతో కలుపుకున్నారు. కొన్ని ప్రతి, ప్రాంతీయ పక్షాలు మోడీయానికి దాసోహమయాయి. వీటిలో ముస్లింలు, దళిత పార్టీలు ఉండటం ఆశ్చర్యం. ఇదే మోడీ నమూనా. ఫాసిస్టు శక్తులు తమ తాత్విక వ్యతిరేకుల మెడలపై కత్తులు పెట్టాయి. కొద్ది మందే మోడీయాన్ని ధైర్యంగా ఎదిరిస్తున్నారు. మోడీ వ్యతిరేకులతో కలవము అనడం శత్రువు శత్రువు మిత్రుడన్న నానుడిని తిరస్కరించి, ఫాసిస్టుల విజయానికి తోడ్పడినట్లే.

సౌజన్య పక్షపాతం (గుడ్డి సమర్థన) గతంలో అనుచరుల్లోనే ఉండేది. ఇప్పుడు పాలక వర్గాల్లోనూ వ్యాపించింది. బలహీనపడ్డ ప్రతిపక్షాల్లో నాయకుల నుండి కార్యకర్తలకు సోకింది. నియంతృత్వానికి దారి తీసింది. కేరళలో వామపక్షాన్ని దింపడానికి కాంగ్రెస్, బిజెపి పరోక్షంగా సహకరించుకున్నాయి. బెంగాల్‌లో 2019 పార్లమెంటు ఎన్నికల్లో మోడీ కంటే దీదీ (మమత) అపాయకరమని, దీదీ కంటే మోడీని ఓడించటం సులభమన్న ప్రచారంతో బిజెపి లాభపడింది.

దేశంలో సంఘ్ పరివార శక్తులు బలపడినప్పటి నుండి ముస్లింలు విపరీతంగా దాడులు, హత్యలు, మానభంగాలు, దొమ్మి దోపిడీలకు గురయారు. ఎనిమిదేళ్లలో ఆర్థికంగా, సామాజికంగానే కాక రాజకీయంగా కూడా ఏకాకులయ్యారు. ఈ పరిస్థితుల్లో తాను రాజకీయంగా బలపడాలని ఎంఐఎం కోరుకోటం సహజం. ఎంఐఎంతో మాట్లాడాలి. సంఘ్ వ్యతిరేక లౌకిక శక్తులకు సహకరించటం దాని అత్యవసర బాధ్యతని గుర్తుచేయాలి. ఉమ్మడి కనీస కార్యక్రమం, ఎత్తుగడలతో బిజెపియేతర ఓట్లు చీలకుండా చూడాలి. సంఘ్ సర్కార్ చేసిన కార్పొరేట్ అనుకూల, ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధ చర్యలు, చట్టాలు వాటి పర్యవసానాలు, ఫాసిజం వైపు పోతున్న దాని నియంతృత్వ పోకడల గురించి ప్రజలకు, ఓటర్లకు, ప్రత్యేకించి యువతకు వివరించాలి. విస్తృత ప్రచారం చేయాలి. ప్రసార ప్రచార సాధనాలు పూర్తిగా ఎదగని కాలంలో ఫాసిజం, నాజీయిజం వ్యాపించాయి. నేటి నాగరీక, ఆధునిక యాంత్రిక వేగ యుగంలో నిర్భయంగా జరుపుతున్న అమానవ మారణకాండలు, జాతివాద మతోన్మాద చర్యలు, కార్పొరేట్ల పక్షపాత పెట్టుబడిదారీ చట్టాలు, విధానాలు దేశీయ సామ్రాజ్యవాద కార్యక్రమాలు నూతన పెట్టుబడిదారీ ఫాసిజం లక్షణాలే.

ఇది నియో నాజీ-ఫాసిజం. నేడు ఉద్యమాలు ఊపందుకున్నాయి. రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో బాధిత వర్గాలన్నిటిని సంఘ్ సర్కార్‌కు వ్యతిరేకంగా సంఘటితపర్చాలి. ప్రతిపక్ష, ప్రాంతీయ పక్షాలను చైతన్యపర్చాలి. సార్వజనీన మానవవాదంతో సార్వత్రిక దేశ వ్యాపిత ఉద్యమాలు నిర్మించాలి. ఆధునిక సాంకేతికతతో బహుళ కోణాల్లో ఫాసిజాన్ని ఎదిరించాలి. అప్రకటిత ఆత్యయిక స్థితితో ఫాసిజానికి దారి తీసిన మోడీయిజాన్ని గద్దె దింపాలి. ప్రపంచం ఒక హిట్లర్‌నే భరించలేకపోయింది. భారత్ ముగ్గురిని భరించగలదా? ఫాసిస్టు వ్యతిరేక శక్తుల ఐక్య కార్యాచరణ నేటి గత్యంతర అనివార్య అవసరం. పెట్టుబడిదారీ పక్షాలన్నీ పాక్షిక బ్రాహ్మణత్వాన్ని వంటబట్టించుకున్న నేటి నేపథ్యంలో ఐక్య కార్యాచరణ బాధ్యత కమ్యూనిస్టులదే, వామపక్షాలదే.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News