Monday, October 14, 2024

అయోధ్యకు మోహన్ లాల్ ఎందుకు వెళ్లలేదంటే…

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావలసిందిగా దేశంలోని ప్రముఖ ఫిల్మ్ స్టార్లు అందరికీ ఆహ్వానాలు అందాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి సహా పవన్ కల్యాణ్, రణబీర్ కపూర్, కంగనా రనౌత్ తదితరులంతా అయోధ్యకు వెళ్లారు. కానీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం ఆహ్వానం అందినా, వెళ్లలేదు. ఆయన గైర్హాజరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే మోహన్ లాల్ నటించిన ‘మలైకొట్టై వాలిబన్’ అనే మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి కేరళలోనూ, దుబాయ్ లోనూ ప్రమోషన్ వర్క్స్ లో మోహన్ లాల్ పాల్గొనవలసి ఉందట. పైగా ఆయన నటించిన ‘ఎల్2 ఎంపూరన్’ అనే మూవీ కోసం  అమెరికా వెళ్లవలసి ఉందట. ముందుగా అంగీకరించిన ఈ పనులన్నీ పూర్తి చేసే హడావిడిలో మోహన్ లాల్ అయోధ్యకు రాలేకపోయినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News