Tuesday, September 10, 2024

సోమవారం రాశి ఫలాలు (05-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ కృషి వల్ల మీ వాళ్ళు సుఖంగా సౌకర్యంగా ఉన్నారన్న వార్త మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. సహోదర సహోదరి వర్గం తరపు బంధువులతో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది.

వృషభం – ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా చేయాల్సింది మీరే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు మొదలుపెడతారు.

మిథునం –  ఎంత మనవాళ్ళైనా సరే కొన్ని మాటలు అదుపులో ఉంచి మాట్లాడడం అనేది జరుగుతుంది. పిల్లల చదువుకు సంబంధించిన విషయాలు దగ్గరుండి చూసుకోగలుగుతారు.

కర్కాటకం – సంతానానికి అనుకున్న కాలేజీలోనే సీటు లభిస్తుంది. మానసికంగా ఆనందంగా గడపగలుగుతారు. పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులు కూడా చిన్న చిన్న పనులను చేసుకోవాల్సి వస్తుంది.

సింహం – పెట్టుబడి ఖర్చు. అభివృద్ధికి. భవిష్యత్ ప్రణాళికలకు ఉపయోగమవుతుంది. సన్నిహితులకు కుటుంబ సభ్యులకు మీ శ్రమ మాత్రమే కనిపిస్తుంది. మీరు చెబితే గాని అభివృద్ధి విషయం మీ కార్యాలయం లోని వారికి తెలియదు.

కన్య – దుష్ప్రచారములు, శత్రుపీడల మూలముగా కొంత మానసిక ఆందోళన కలుగుతుంది. మీ విజయమే శత్రువుల  ఓటమికి కారణం అనే భావన మీలో కలుగుతుంది.

తుల – అడ్వాన్స్గా ఇచ్చిన ధనం చేతికి వచ్చుట కష్టమవుతుంది. డాక్టర్స్. లాయర్స్. చార్టెడ్ అకౌంటెంట్స్. కంప్యూటర్ ఇంజనీర్స్ వారికి మంచి అవకాశాలు  లభిస్తాయి.

వృశ్చికం – సంతానం వలన సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంప్రాప్తిస్తాయి. అయితే వ్యక్తిగతంగా మీకు కొంత అసంతృప్తి కలగవచ్చు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి కొద్ది అవకాశం ఉన్నాయి.

ధనున్సు –  ఎంతగానో ఎదురు చూస్తున్నా ఒక సంబంధం కుదురుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. సహోదర సహోదరి వర్గీయులు కొన్ని కారణముల వలన దూరంగా ఉంటారు.

మకరం – రాజకీయంగా అనుకూలమైన సమయం గోచరిస్తున్నది. పై అధికారులు వారి అండదండలు మీకు లభిస్తాయి. కొంత ఎడబాటును బేధాభిప్రాయములను ఆకస్మిక సంఘటనలను గ్రహగతి సూచిస్తున్నది.

కుంభం – భాగస్వాముల యందు గల నిజాయితీపరులు. ధన బలము గలవారు తొలగిపోయే అవకాశం ఉన్నది జాగ్రత్త వహించండి. మీతో పెట్టుబడికి ధనం లేని నిజాయితీపరులు అంతగా మేధావులు కాని వారు అనుచరులుగా భాగస్వాములుగా మిగిలే అవకాశాలు అధికంగా గోచరిస్తుంది.

మీనం – సంతానం స్థిరపడకపోవడం మీకు మానసిక వేదన కారణమయ్యే అవకాశం గోచరిస్తుంది.  ఉద్యోగంలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కు అనుకూలమైన సమయం.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News