Wednesday, September 17, 2025

ముంబైలో వారాంతానికి రుతుపవనాలు : ఐఎండి

- Advertisement -
- Advertisement -

ముంబై : బిపర్‌జాయ్ తుపాన్ కారణంగా పది రోజులు ఆలస్యమైన రుతుపవనాలు ఇక పురోగతితో ఈనెల 23-25 మధ్య ముంబైలో ప్రవేశించవచ్చని భారత వాతావరణ విభాగం బుధవారం వెల్లడించింది. రీజినల్ మెటియొరాలజికల్ సెంటర్ (ఆర్‌ఎంసి) అధినేత ఎస్‌జి కాంబ్లే రుతుపవనాల రాకపై మాట్లాడారు.

ఈనెల 11న కోస్తా రత్నగిరికి రుతుపవనాలు చేరుకున్నా బిపర్‌జాయ్ తుపాన్ వల్ల ముందుకు రాలేక పోయాయని, గుజరాత్ కచ్ తీరంలో జఖాయు వద్ద గత గురువారం తుపాన్ తీరం దాటిందని చెప్పారు. ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. సాధారణంగా నైరుతి పవనాలు కేరళలో జూన్ 1 నాటికి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి వారం రోజులు ఆలస్యంగా ఈ నెల 8,9 తేదీల్లో మన భూభాగం లోకి ప్రవేశించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News