Saturday, May 4, 2024

ఫ్లైఓవర్ ప్రమాదం.. బాధితులను పరామర్శించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎల్‌బినగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఎల్‌బినగర్ వద్ద నిర్మిణంలో ఉన్న ప్లైఓవర్ స్లాబ్ కూలి గాయపడిన వారిని మంత్రి కెటిఆర్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు.

ఈ సందర్బంగా చికిత్స పొందుతున్న, వారి యోగక్షేమలు అడిగి తెలుసుకున్న మంత్రి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన పడరాదని మంత్రి కెటిఆర్ బాధితులకు భరోసా ఇచ్చారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ ఆదేశించామని చెప్పారు. ప్రమాదానికి కారణాలపై జిహెచ్‌ఎంసి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీతో పాటు, జెఎన్‌టియూ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సైతం విచారణ జరిపించి ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. ఈ విచారణలో వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మంత్రి కెటిఆర్ వెంట ఎల్‌బినగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీఅరవింద్ కుమార్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News