Saturday, July 27, 2024

ఐదు రోజుల్లో కేరళకు రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎండలతో అల్లాడిపోతు న్న ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురందించింది.వచ్చే 5 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉందని ఐఎండీ వెల్లడించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేర ళ తీరాన్ని తాకనున్నట్లు ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది. భారత వాతవరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉం ది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి.

తెలంగాణలో తేలికపాటి వర్షం
కిందిస్థాయిలో గాలులు పడమర, వాయువ్యదిశల నుం చి రాష్ట్రంలోకి వీస్తున్నాయి.రాష్ట్రంలో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురిశాయి. గరిష్టంగా నారాయణఖేడ్‌లో 14.5 మి.మి వర్షం కురిసింది. రాగల 2 రోజులు రా ష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.సోమవారం రాష్ట్రంలో గిరిష్టంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.7డిగ్రీలు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News