వన్డే, టి-20 ఫార్మాట్‌లలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. ఆసియాకప్ 2025 కోసం ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్‌కి (Shreyas Iyer) చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. శ్రేయస్‌ని ఎంపిక చేయకపోవడాన్ని అభిమానులు, మాజీలు తప్పుబడుతున్నారు. తాజాగా శ్రేయస్‌ను ఎంపిక చేయకపోవడంపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ కారణం చెప్పాడు. శ్రేయస్‌కు ఉండే నాయకత్వ లక్షణం వల్లే అతడిని జట్టులోకి తీసుకోలేదని పనేసర్ అభిప్రాయపడ్డారు.
‘‘టీం ఇండియాలో శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) చోటు దక్కకపోవడంపై చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి నాయకత్వ పటిమ. సాధారణంగా ఇలాంటి నైపుణ్యం ఉంటే జట్టులోకి తీసుకుంటారు. కానీ, శ్రేయస్‌కు మాత్రం అదే శాపం. ఇప్పటికే టీంలో సారథి స్థాయి ప్లేయర్లు ఉన్నారు. అదే యువ క్రికెటర్‌ను తీసుకుంటే ప్రధాన కోచ్ గంభీర్‌కు మేనేజ్ చేయడం సులువుగా ఉంటుంది. అందకే శ్రేయస్ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపడం లేదు’’ అని పనేసర్ అన్నాడు.
Also Read : ఆసియా కప్ 2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు