Sunday, October 6, 2024

కంగన సినిమాపై వారంలోగా తేల్చండి: బాంబే హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ముంబై:  నటి, పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ జారీ విషయంలో వారం రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. సెన్సార్ సర్టిఫికేట్ ఆ సినిమాకు లభించనందున ఇంతవరకు ఆ సినిమా విడుదలకు నోచుకోకుండా డోలాయమానంలో ఉంది. ‘ఎమర్జెన్సీ’ సినిమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. ఆ సినిమాను కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తీశారు. అయితే ఓ వర్గం ఈ చిత్రంపై ఆక్షేపణలు తెలుపుతూ మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సినిమాలో తమని తక్కువ చేసి చూపారని పేర్కొంది.

మరోవైపు శిరోమణి అకాలీదళ్ కూడా చిత్రాన్ని అడ్డుకోవాలని సెన్సార్ బోర్డును కోరింది. అయితే సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుతూ కంగనా రనౌత్, చిత్ర నిర్మాణ సంస్థ జీ ఎంటర్ టైన్మెంట్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలోనే తాజాగా జరిపిన విచారణ తర్వాత వారం రోజుల్లోగా ఓ నిర్ణయానికి రావాలని సెన్సారు బోర్డును బాంబే హైకోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News