Thursday, December 1, 2022

గొల్లపూడిలో తల్లీకూతురు ఆత్మహత్య

- Advertisement -

Mother and daughter commit suicide in Gollapudi

అమరావతి : ఎపిలోని విజయవాడలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గొల్లపూడిలో తల్లీ కూతురు ఆత్మహత్య కలకలం రేపుతోంది. గొల్లపూడి వన్‌ సెంటర్‌లో నివాసముంటున్న తల్లీకూతురు అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్థుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను మాధవి,సత్యవతిగా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles