Thursday, October 10, 2024

నార్సింగిలో 18వ అంతస్తు పైనుంచి దూకిన తల్లీకూతుళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన మూడేళ్ల కూతురుతో కలిసి తల్లి భవన పైనుంచి దూకిన సంఘటన హైదరాబాద్‌లోని నార్సింగిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భీమవరానికి చెందిన మానస(30) తన భర్త, కూతురు కృషి(03)తో కలిసి నార్సింగిలోని మైహోమ్ అవతార్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఐటి కంపెనీలో భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆదివారం రాత్రి కూతురుతో కలిసి 18వ అంతస్తు పైనుంచి దూకింది. తల్లీకూతుళ్లు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఇన్ స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఆమె గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని మృతురాలి సోదరుడు పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News