Sunday, September 15, 2024

రెండు కుటుంబాలను బలి తీసుకున్న ఆర్థిక ఇబ్బందులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త ఆంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. అతని కిడ్నీ ఫెయిల్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త అనారోగ్యం పాలవ్వడం, అర్థిక ఇబ్బందులు వెంటాడడంతో కుటుంబం పోషణ ఇబ్బందిగా మారింది.

ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలను పోషించడంలో ఇబ్బందులు ఏర్పడడడంతో మనస్తాపానికి గురైన తల్లి సావిత్రి (28) తన ముగ్గురు పిల్లలు కుమారుడు జస్వంత్, చిన్మయి, చిత్రలకు విషమిచ్చి తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టిన అనంతరం మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమితం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో…

ఆన్‌లైన్ బెట్టింగ్, ఆర్ధిక ఇబ్బందులు తాళలేక, ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన ఇద్దరు చిన్నారులకు, భార్యకు తన ఇంట్లో ఊ పిరి అడగకుండా చేసి చంపి అనంతరం తాను ఉ రి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కు ముందు మంచిర్యాలలో ఉన్న తన తండ్రి ఫోన్ లో మాట్లాడి ఆత్మహత్యకు పాల్పడుతున్నామని చె ప్పడంతో తండ్రి వెంటనే జీడిమెట్ల పోలీసులకు స మాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘట నా స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్ సహస్ర అపార్ట్ మెంట్‌లో గత మూడు సంవత్సరాల క్రితం మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40) వర్షిణి (38) కుటుంబం అద్దెకు దిగారు. వీరికి ఇద్దరు పిల్లలు రిషికాంత్ (11) నారాయణ స్కూల్‌లో 6 తరగతి చదువుతున్నాడు. విహంత్ (3) చిన్నవాడు. వెంకటేష్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉ ద్యోగం చేస్తూ జీవనం సాగిస్తునారు. గత కొద్దీ నె లలుగా ఆన్‌లైన్ లోన్స్‌తో ఇబ్బంది పడుతున్న వెం కటేష్ ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతను తన భార్య వర్షిణి, ఇద్దరు చిన్నారులకు ఊపిరి అడకుండా చేసి తన ఇంట్లో గదిలో చంపి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

అయితే చనిపోయే ముందు తండ్రితో ఫోన్ లో మాట్లాడిన వెంకటేష్ తాము చనిపోతున్నట్లు చెప్పి ఈ దారుణనానికి ఒడిగట్టాడు. వెంటనే మృతుని తండ్రి వాచ్‌మెన్‌కు ఉదయం మూడు గంటల సమయం లో ఫోన్ చేసి వెంకటేష్ వారిని నిద్ర లేమని చెప్పా డు. అప్పుడు వారు లేవ లేదని తిరిగి 5ః30 వచ్చి వాచ్‌మెన్ తలుపు కొట్డగా లేవడం లేదని, అనంత రం ప్రక్కన వారికి తెలుపగా ఇంట్లో వారంతా వి గత జీవులై ఉన్నారని జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చామని వాచ్‌మెన్ తెలిపారు. ఉదయం అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి చూసే సరికి పిల్లలు ఇద్దరు ఒక రూమ్ లో భార్య వర్షిణి మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. భర్త వెంకటేష్ ఉరి వేసుకొని మృతి చెందారని, జీడిమె ట్ల పోలీసులు తెలిపారు. కుటుంబ ఆత్మహత్య ఘ టన స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. బాలానగర్ డివిజన్ ఏసిపి హనుమంతరావు ఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు ఆరా తీయాలని సిబ్బందికి సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News