Thursday, July 17, 2025

పాపం.. పసిప్రాణం: పుట్టిన బిడ్డను బస్సులోనుంచి విసిరిన తల్లి

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రయాణిస్తున్న బస్సులో తనకు అప్పుడే పుట్టిన పసికందును 19 సంవత్సరాల ఓ తల్లి ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. దీనితో ఈ మగపసికందు అక్కడికక్కడే చనిపోయింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు పర్బణీ ప్రాంతంలో వెళ్లుతుండగా ఈ దారుణం జరిగింది. స్లీపర్ బస్సు పత్రిసెలూ రాదారిలో వెళ్లుతుండగా మంగళవారం తెల్లవారుజామున ఈ కన్నతల్లి కర్కశంగా వ్యవహరించింది. నిండుచూలాలు అయిన మహిళ భర్తగా పేర్కొంటూ ఓ మగాడితో కలిసి సంత్ ప్రయాగ్ ట్రావెల్స్ బస్సులో కూర్చుంది. కొద్ది సేపటికి పురిటి నొప్పులు వచ్చాయి. మగబిడ్డ పుట్టాడు. అయితే బస్సులో ఉన్న ఓ వ్యక్తి వీరిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండగానే ఈ మహిళ తన వెంట ఉన్న వ్యక్తి సాయం తీసుకుని పసికందును బయటకు విసిరేశారని గుర్తించాడు. దీనితో బస్సు ఆపి రోడ్డుపై చూడగా అప్పటికే పసికందు చితికి పోయి చనిపోయి ఉంది.

దారుణానికి పాల్పడ్డ మహిళను రితికా ధేరెగా గుర్తించారు. వెంబడి ఉన్న వ్యక్తిని అల్తాఫ్ షేక్‌గా నిర్థారించారు. ఇద్దరిని పోలీసులు విచారించగా బిడ్డను బయటకు విసిరేసింది నిజమేనని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పుట్టిన బిడ్డను పెంచే ఆర్థిక శక్తి లేకపోవడంతోనే ఈ విధంగా చేశామనివీరు తెలిపారు.ఈ ఇద్దరూ ఏడాదిన్నరగా పుణేలో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు. ప్రసవించి ఘాతుకానికి దిగిన మహిళను ఆసుపత్రికి, భర్తగా చలామణి అయిన వ్యక్తిని జైలుకు పంపించారు. స్థానిక పర్బణీ పోలీసు బృందాలు పసికందుకు అంతా తామే అయ్యి అంత్యక్రియలు జరిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News