- Advertisement -
మన తెలంగాణ/మోత్కూర్: స్థానిక ఎన్నికల్లో చట్ట బద్దంగా బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిసి ప్రజా ప్రతినిధుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన బిసిల మహా ధర్నా కార్యక్రమంలో మోత్కూర్ మండల బిసి నాయకులు పాల్గొన్నారు. బిసి నాయకులు పొన్నెబోయిన రమేష్, జంగ శ్రీను, కొండా సోం మల్లు, గజ్జి మల్లేష్, మల్లం సైదులు, చౌగోని సత్యం గౌడ్, అన్నందాసు విద్యాసాగర్, గనగాని రాజేష్, చేతరాశి వెంకన్న, చేతరాశి చంద్రయ్య, పంజాల మహేందర్, దండ్ల కళ్యాణ్, మర్రిపెళ్లి చంద్రయ్య, జంగ నరేశ్, జంగ శివ, దండెబోయిన నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -