Saturday, May 17, 2025

ప్రభుత్వంపై కెటిఆర్ బురదజల్లుతున్నారు

- Advertisement -
- Advertisement -

కోడిగుడ్డుపైన ఈకెలు పీకినట్లు బిఆర్‌ఎస్ రాజకీయం చేస్తోంది
పదేళ్ల పాలనలో తెలంగాణ ఆడబిడ్డల గురించి
కెటిఆర్ పట్టించుకోలేదు
ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి చూస్తుంటే ప్రభుత్వంపై కెటిఆర్ బురదజల్లుతున్నారని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కోడిగుడ్డుపైన ఈకెలు పీకినట్లు బిఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని, సైకో రాము (కెటిఆర్) కల్లు తాగిన కోతి లాగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలకు భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రామప్ప గుడి దగ్గర అత్యుత్సాహాంతో ఎవరో ఒక అమ్మాయి మిస్ వరల్ కంటెస్టెంట్ కాళ్లు కడిగిందని, దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నట్లు కెటిఆర్ గొడవ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దానికి తెలంగాణ మహిళల ఆత్మ గౌరవం ఏమైంది అంటూ సోనియాగాంధీకి కెటిఆర్ ట్వీట్ చేయడం హాస్యా స్పదంగా ఉందన్నారు. పదేళ్ల పాలనలో వాళ్ల ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడని కెటిఆర్ మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కలెక్టర్లతో కాళ్లు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి కెటిఆర్‌దని ఆయన ఫైర్ అయ్యారు. జనాన్ని తప్పుదోవ పట్టించాలని కెటిఆర్ రోజు ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో దండుకున్న వందల కోట్ల రూపాయలతో కొన్ని యూట్యూబ్ చానల్స్‌లో కెటిఆర్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రెస్‌మీట్ వీడియోలను కట్ చేసి వాళ్లకు అనుకూలంగా క్రియేట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News