Tuesday, September 10, 2024

వక్ఫ్ బిల్లుపై జాయింట్ ప్యానెల్‌లో ఉండే ఎంపీలు వీరే!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లును ఆగస్టు 8న లోక్‌సభలో రిజిజు ప్రవేశపెట్టారు ,  తీవ్ర చర్చ తర్వాత జాయింట్ పార్లమెంటరీ ప్యానెల్‌కు దానిని పంపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను పరిశీలించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కి 21 మంది లోక్‌సభ ఎంపీల పేర్లను ప్రతిపాదించారు. అలాగే 10 మంది సభ్యుల పేర్లను సిఫారసు చేయాలని రాజ్యసభను కోరారు. ఈ ప్రతిపాదనను సభ ఆమోదించింది.

 జెపిసిలో చేర్చబడిన 21 మంది ఎంపీల జాబితా:

దిగువ సభకు చెందిన 21 మంది ఎంపీలు జెపిసి సభ్యులుగా ఉంటారు. వారు:   జగదాంబిక పాల్, నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, దిలీప్ సైకియా, అభిజిత్ గంగోపాధ్యాయ, డికె.అరుణ, గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మహ్మద్ జావూద్ , మౌలానా మొహిబుల్లా నద్వీ, కళ్యాణ్ బెనర్జీ, ఎ.రాజా, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, దిలేశ్వర్ కమైత్, అరవింద్ సావంత్, సురేశ్ గోపీనాథ్, నరేశ్ గణపత్ మ్హాస్కే, అరుణ్ భారతి , అసదుద్దీన్ ఒవైసీ.

ఇది క్రూరమైన చట్టమని, రాజ్యాంగంపై ప్రాథమిక దాడి అని కాంగ్రెస్ ఎంపీ కెసి. వేణుగోపాల్ అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25 సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ బిల్లు వివక్షాపూరితమైనది ,  ఏకపక్షంగా ఉందని, దీనిని తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఏకం చేయకుండా విభజించే పనిని చేస్తోందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ‘మీరు ముస్లింలకు శత్రువే అనడానికి ఈ బిల్లు నిదర్శనం’ అని ఆయన అన్నారు.

ఈ కమిటీ తన నివేదికను వచ్చే సెషన్‌లో మొదటి వారం చివరి కల్లా లోక్‌సభకు సమర్పించనుంది.

Rijiju

Asaduddin

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News