Saturday, August 2, 2025

విఆర్ఒను లైంగికంగా వేధించిన ఎంఆర్ఒ సస్పెండ్… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మహిళా విఆర్ఒను లైంగికంగా వేధించిన ఎంఆర్ఒను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వాకాడు తహసీల్దార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో చర్యలు తీసుకున్నాడు. తహసీల్దార్ సస్పెండ్ ఘటనపై విచారణ అధికారిగా లీగల్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్ నియమించారు. ఇంటికి వచ్చి బట్టలు విప్పి కోరిక తీర్చాలంటూ మహిళా విఆర్ఒను ఎంఆర్ఒ వేధించాడు. మహిళా విఆర్ఒ తల్లి ఎంఆర్ఒను చితకబాదింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉండే మహిళా విఆర్ఒను ఎంఆర్ఒ కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. మీ ఇంటికి వస్తా కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా? అని ఎంఆర్ఒ మెసేజ్‌లు పెట్టాడు. శుక్రవారం మహిళా ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలంటూ ఎంఆర్ఒ వేధించడంతో అతడిని విఆర్ఒ తల్లి చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరుపతి కలెక్టర్ స్పందించి ఎంఆర్ఒను సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News