Saturday, July 27, 2024

డ్రోనీని ఆవిష్కరించిన ధోనీ

- Advertisement -
- Advertisement -

MS DHONI Launches DRONI Made in India

రాంచీ : టీమిండియా మాజీ సారధి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం వ్యవసాయం వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకాన్ని అబివృద్ధి చేస్తున్న సంస్థ ఏరోస్పెస్‌కు ఆయన బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక డ్రోన్‌ను ధోనీ చేతుల మీదుగా సొమవారం విడుదల చేసింది. కాగా, దానికి ‘డ్రోనీ’ అని నామకరణం చేశారు. ఈ సంతర్భంగా ధోనీ మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా దేశంలో విధించి లాక్‌డౌన్ తనను వ్యవసాయం వైపు మళ్లించిందని, వ్యవసాయం రంగంలో డ్రోన్ల అవశక్యతను తెలిపారు. రెండేళ్ల క్రితం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఆయన సొంత గ్రామంలో 10 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News