Thursday, September 11, 2025

ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన గుప్తా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Sadhana Gupta

గురుగ్రామ్:  సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆమె గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతోంది. ములాయం సింగ్ రెండో భార్య సాధన గుప్తా అతని కంటే 20 ఏళ్లు చిన్నది. 2003 వరకు సాధన గుప్తా గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య మాలతి యాదవ్. ఆమె ప్రస్తుత సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ తల్లి. ఆమె మరణించిన ఏడాదికి ములాయం, సాధనను పెళ్ళాడారు. ఇక సాధన గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ఆయన భార్య అపర్ణా యాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

సాధన గుప్తా మరణంపై యూపి ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ఖేదాన్ని వ్యక్తం చేశారు. దేవుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News