Wednesday, April 30, 2025

ఎస్‌ఆర్‌హెచ్‌పై విక్టరీతో.. ముంబై అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై విజయం సాధించిన ముంబై.. గురువారం సన్‌రైజర్స్‌ని చిత్తుగా ఓడించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ క్రమంలో ముంబై ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒకే వేదికపై ఛేజింగ్‌లో అత్యధికసార్లు గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. వాంఖడే స్టేడియం వేదికగా.. 47 మ్యాచుల్లో 29 మ్యాచుల్లో ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై కెకెఆర్ పేరిట ఉన్న రికార్డును దాటేసింది. కెకెఆర్ ఈడెన్ గార్డెన్స్‌లో 40 మ్యాచుల్లో 28 సార్లు విజయం సాధించింది.

ఇక నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేయగా.. ముంబై 18.1 ఓవర్లలో 166 పరుగులు చేసి.. విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన విల్‌ జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News