- Advertisement -
ఐపిఎల్ సీజన్ 2025లో ముంబై ఇండియన్స్ టీమ్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్ రికెల్టన్ 25, విల్ జాక్స్ 21, తిలక్‌వర్మ 27, నమన్‌ధిర్ 24 (నాటౌట్) పరుగులు చేశారు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో ఢిల్లీ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.
- Advertisement -