Thursday, October 10, 2024

మున్నేరుకు భారీ వరద…. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, ఖమ్మం, ములుగు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురువడంతో పాటు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో మున్నేరు వాగు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మంలోని మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్‌లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ వరద వచ్చే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. రెండో రోజుల పాటు మున్నేరు పరివాహక ప్రాంతాలలో రోడ్లన్నీ బ్లాక్ చేశారు. శనివారం రాత్రి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముంపు ప్రాంతాలలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఖమ్మంలో పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News