Tuesday, March 21, 2023

చిన్నప్పుడు నా తండ్రే నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు: స్వాతి మలివాల్

- Advertisement -

న్యూఢిల్లీ: బాల్యంలో తన తండ్రి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీ మహిళా కమిషన్(డిసిడబ్ల్యు) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ శనివారం వెల్లడించారు. డిసిడబ్ల్యు వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె మాట్లాడుతూ తన కన్నతండ్రే తనపై లైంగిక దాడి పాల్పడ్డాడని, తనను తరచు కొట్టేవాడని ఆమె చెప్పారు. తండ్రి నుంచి దెబ్బలను తప్పించుకోవడానికి తాను మంచం కింద దాక్కునేదానినని ఆమె తెలిపారు. తన తండ్రి తనను జుట్టు పట్టుకుని ఈడ్చి గోడకేసి కొట్టడం తనకింకా గుర్తుందని ఆమె పేర్కొన్నారు.

మంచం కింద దాక్కుని మహిళలు తమ హక్కులను సాధించుకోవడానికి తాను ఎలా సాయపడగలనని, మహిళలు, ఆబాలికలపై దాడి చేసేవారికి ఎలా గుణపాఠం చెప్పాలనే విషయమై ఆలోచించేదాన్నని స్వాతి తెలిపారు.
నాలుగవ తరగతి చదివే వరకు తన తండ్రి వద్ద తాను ఉన్నానని, ఆ కాలంలో ఆయన తనపై చాలాసార్లు దాడి చేశాడని మీడియాతో మాట్లాడుతూ ఆమె వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. డిసిడబ్ల్యు అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల విజేతలను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా 100 మంది మహిళలకు అవార్డులను ప్రదానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles