Wednesday, April 30, 2025

కమలం గూటికి బిఆర్‌ఎస్ ఎంపి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిఆర్‌ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపి పొతుగంటి రాములు గురువారం బిజెపి పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఆయన ఆపార్టీ పెద్దల సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. గత రెండు నెలల నుంచి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. తానే ఎంపి అభ్యర్థిననని ఇప్పటికే బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు కమలం గూటికి చేరుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News