Saturday, April 13, 2024

12మంది ప్రాణం తీసిన పుకారు

- Advertisement -
- Advertisement -

రాంచి:జార్ఖండ్ ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జార్ఖండ్‌లోని జాంతారా సమీపంలోని కాలాఝరియా స్టేషన్ వద్ద రైలు ఢీకొని 12 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. జాంతారా-కర్మతండ్ మార్గంలోని కల్జ్‌హరియా సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న భగల్‌పూర్ వెళ్లే అంగ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు పక్కనున్న రైలు పట్టాలపైకి దూకారు. అయితే అదే సమయంలో ఝంఝా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ అదే మార్గంలో రావడంతో రైలు కింద పడి తునాతునకలయ్యారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది, రైల్వే పోలీసులు హుటాహుటిన తరలివెళ్లారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి వైద్య బృందాలు, అంబులెన్సులు అక్కడకు చేరుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News