Monday, April 29, 2024

తెలంగాణ మరో హిమాచల్ కావొచ్చు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పరిస్థితులు త్వరలో తెలంగాణలో కనిపించవచ్చని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉందని, అధికార కాంగ్రెస్‌పై సొంత ఎమ్మెల్యేలు తిరగబడ్డారని అసహనంతోనే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపికి ఓటేశారన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలోనూ రావచ్చని, రాష్ట్రంలో తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ కనిపిస్తుందని చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డి పరిస్థితి దారుణంగా మారుతుందని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని ఎన్నికల బరిలో గెలిచే గుర్రాలనే బరిలోకి దింపుతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వాళ్లు తమ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. దురుసు మాటలు ఆపి హామీల సంగతి ఆలోచించాలని సూచించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్కసారిగా అది దూరం అయ్యే సరికి బిఆర్‌ఎస్ సైతం ఇష్టానుసారం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, బిఆర్‌ఎస్ నుంచి కూడా కొందరు మాతో టచ్‌లో ఉన్నారని మేం ఆచితూచి వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు పథకాలు అందరికి అని చెప్పి, ఇప్పుడు షరతులపై కాంగ్రెస్ ఆంటోందని, ప్రజలను మోసం చేసేందుకే గ్యారెంటీలు ఇచ్చిందని విమర్శించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులు విరిచి కొడితే కానీ గ్యారంటీలు అమలు కావంటూ చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News