Monday, April 29, 2024

ఎసిబి వలలో నల్గొండ ఆసుపత్రి సూపరింటెండెంట్

- Advertisement -
- Advertisement -

నల్గొండ : ఎసిబి వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చూనాయక్ శుక్రవారం లంచం తీసుకుంటుండగా ఎసిబి ఉమ్మడి జిల్లా డిఎస్‌పి ఎం.వి. శ్రీనివాసరావుకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే…సర్జికల్ డ్రగ్స్ కాంట్రాక్టర్ రాపోలు వెంకన్నకు మెడికల్ కాంట్రాక్టు ఇచ్చేందుకు వేధించి రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు వేగలేక ఎసిబి అధికారులకు ఆశ్రయించారు. దీంతో జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శుక్రవారం ఉదయం ప్రకాశం బజార్లో అద్దెకు ఉండే ఇంట్లో రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. సర్జికల్ డ్రగ్స్ కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న గత కొన్ని నెలలుగా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి సర్జికల్ సప్లై, కొన్ని నాన్ టెండర్ డ్రగ్స్ కూడా బిల్స్ సప్లై చేస్తున్నారు.

గత కొన్ని నెలలు గా అవసరమైన కొన్ని సర్జికల్స్, డ్రగ్స్ ఎలాంటి టెండర్ లేకుండా అవసరం ఉన్న డ్రగ్స్ అనుమతి మేరకు ప్రభుత్వ నిబంధనలు మేరకు సప్లై చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ కాంట్రాక్టర్ దగ్గర నెల క్రితం లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు. నాన్ టెండర్ ప్రక్రియకు నాలుగు నెలలు ఉండగానే టెండరు వేస్తే తనకు కొంత డబ్బు సమకూర్చాలని డబ్బులు డిమాండ్ చేశారు. ఆ బాధ భరించలేక ఎసిబి అధికారులను బాధితుడు సంప్రదించారు. శుక్రవారం ఉదయం సూపరింటెండెంట్ లచ్చు నాయక్ రూ. 3లక్షలు తీసుకోవడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఎసిబి ఇన్స్పెక్టర్లు రంగారావు, వెంకట్ రావు, రామారావు, సిబ్బంది శ్రీధర్, సంపత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News