Saturday, July 27, 2024

జెఈఈలో బాలికల విభాగంలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో నారాయణ ఆల్‌టైం రికార్డ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జెఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారు. ఓపెన్ కేటగిరీలో బాలికల విభాగంలో ఎన్. నాగ భవ్యశ్రీ ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఓపెన్ కేటగిరీలో బాలాజీ రెడ్డి నాగిరెడ్డి 9వ ర్యాంక్, ఉజ్వల్ శంకర్ 11వ ర్యాంక్, యువరాజ్ గుప్తా 13వ ర్యాంక్, చైతన్య మహేష్ 15వ ర్యాంకు, సమీర్ అరవింద్ పాటిల్ 20వ ర్యాంకుతోపాటు 22, 25, 26, 28, 33, 34, 35, 37, 43, 44, 45, 46, 47, 56, 58, 61, 69, 71, 72, 78, 87, 90, 93, 99 వంటి టాప్ 100 లోపు 29 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్ పి. సింధూరనారాయణ, పి.శరణినారాయణ తెలిపారు.

అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 1, 1, 1, 2, 2, 3, 4, 4, 5, 6, 8, 8, 9, 10, 11 వంటి 11 లోపు 15 ర్యాంకులు, 100 లోపు 106 ర్యాంకులను కైవసం చేసుకుని ఐఐటి ఆశయాలను సాకారం చేయటంలో వేరెవ్వరూ నారాయణకు సాటిలేరని, సాటిరారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1,80,000 మంది విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షా ఫలితాలలో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారని పేర్కొన్నారు.

జాతీయస్థాయిలో నిర్వహించబడే జెఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానం ఆన్‌లైన్ ప్రక్రియలో నిర్వహించినప్పటికీ, నారాయణ వినూత్నంగా రూపొందించిన ప్రణాళిక, వారాంతపు టాపిక్‌వైజ్, క్యుములేటివ్, సెమీగ్రాండ్ మోడల్, గ్రాండ్ మోడల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాక్ పరీక్షలు, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్‌లు, ఆన్‌లైన్ పరీక్షకు అనుగుణంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ వలనే నారాయణ విద్యార్థులు ఇంతటి ప్రతిభాపాఠవాలను ప్రదర్శించగలిగారని చెప్పారు. మారుతున్న విద్యావిధానాలకు అనుగుణంగా మైక్రోషెడ్యూల్స్, వీక్లీ టెస్టుల నిర్వహణలో నిరంతరం మార్పులు చేసుకుంటూ ఇంతటి ఘనవిజయానికి కారణమని తెలిపారు. ఈ అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పి. సింధూర నారాయణ, శరణి నారాయణ అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News