Saturday, July 27, 2024

చిప్ప చేతపట్టుకున్న పాకిస్థాన్: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

అంబాల(హర్యానా):  ప్రధాని నరేంద్ర మోడీ హర్యానాలోని అంబాల లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. దేశంలో బలీయమైన ప్రభుత్వం ఉంటే శత్రు దేశాలు మన దేశాన్ని ఛాలెంజ్ చేయలేవని అన్నారు. 70 ఏళ్లుగా మన దేశాన్ని శత్రు దేశం బాంబులతో చికాకు పరుస్తూ వచ్చిందన్నారు. ‘‘ పాకిస్థాన్ 70 ఏళ్లుగా ఇండియాను కష్టపెడుతూ వచ్చింది. కానీ నేడు ‘చిప్ప చేత పట్టుకుని అడుక్కునే స్థితికి చేరింది’.  అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి బెయిలవుట్ ప్యాకేజీలు కోరుతోంది’’ అన్నారు.

‘‘ దేశంలో బలీయమైన ప్రభుత్వం ఉంటే శత్రు దేశాలు వణికిపోతాయి’’ అని కూడా ఆయన అన్నారు. ‘‘దేశంలో లోక్ సభ ఎన్నికలకు ఇంకా కేవలం రెండు వారాల సమయమే ఉంది.  జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి గెలుస్తుంది. జూన్ 4కు ఇంకా కేవలం 17 రోజులే ఉన్నాయి. కాంగ్రెస్ దాని ఇండీ అలయెన్స్ పార్టీలు పూర్తిగా దెబ్బతిన్నాయి’’ అన్నారు.

నరనరాల్లో దేశభక్తి ఉన్న రాష్ట్రం హర్యానా అని ఆయన తన ప్రసంగంలో కీర్తించారు. హర్యానా ఏమంటుందంటే ‘ ఫిర్ ఏక్ బార్’ అని మోడీ అనగానే… ‘మోడీ సర్కార్’ అంటూ ప్రజలు రెస్పాండ్ అయ్యారు.  కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతిమయం,  మోసాలతో కూడుకున్నదేనని మోడీ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ మొదటి కుంభకోణమే సైనిక సాయుధ బలగాలకు సంబంధించింది. అధికారంలో కొనసాగడానికి కొత్త స్కాములతో ఆ పార్టీ తన ట్రాక్ రికార్డును కొనసాగించింది. బోఫోర్స్ స్కామ్, సబ్ మెరైన్ స్కామ్, హెలికాప్టర్ స్కామ్ వంటివి జరిగాయి. భారత దేశం బలహీనంగా ఉండడానికి కాంగ్రెస్ సాయుధ బలగాలను బలహీనంగా ఉంచింది. ఆయుధాల దిగుమతుల పేరిట డబ్బు సంపాదించుకుంది. జవానులకు ఏమి కావాలో కూడా వారు లెక్కలోకి తీసుకోలేదు’’ అని మోడీ ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News