Tuesday, September 10, 2024

గ్రాండ్‌గా నరేష్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ యాక్టర్ డాక్టర్ నరేష్ విజయకృష్ణ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ పూర్తి చేస్తుకున్న సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా విజయకృష్ణ మందిర్, ఘట్టమనేని ఇందిరాదేవి స్పూర్తి వనాన్ని ప్రారంభించారు.

ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద పాల్గొన్నారు. న్యాయమూర్తి ఎన్ మాధవరావు, తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూరేపల్లి ప్రశాంత్, జాకీ ష్రాఫ్, పూనమ్ ధిల్లాన్, జయసుధ, సుహాసిని, కుష్బూ, ఇతర ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. భావి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ప్రజలకు ఇది తన కానుకని డాక్టర్ నరేష్ విజయకృష్ణ ప్రసంగంలో పేర్కొన్నారు.

చిత్ర పరిశ్రమకు కృషి చేసిన దిగ్గజాలందరికీ స్మారక చిహ్నంగా రూపొందించబడిన స్పూర్తి వనం సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల విగ్రహాలతో ప్రారంభించబడింది. ఈవెనింగ్ మీట్ అండ్ గ్రీట్ రిసెప్షన్‌లో నరేష్ విజయకృష్ణ, పవిత్ర లోకేష్, జయసుధలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తరపున మాదాల రవి, శివబాలాజీ, మహారాష్ట్ర సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూనమ్ ధిల్లాన్, జాకీ ష్రాఫ్, సుహాసిని, కుష్బూ, ప్రముఖ నటులు సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News