Friday, September 22, 2023

ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనిక పరిపాలనపై జాతి యావత్తూ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -
  • రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
  • పట్నంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

ఇబ్రహీంపట్నం: తొమ్మిది సంవత్సరాల తెలంగాణ యావత్తు దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనిక పరిపాలనను జాతి యావత్తూ ప్రశంసిస్తున్నదని జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన ముందుచూపుతోనే నియోజకవర్గంలో ఆదర్శమైనా పల్లలు, పట్టణాలు అభివృద్ది చెందాయని తెలిపారు. అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయంగా విద్యుత్ అందిస్తూ వెలుగులు విరజిమ్ముతున్నదని అన్నారు.

శుక్రవారం సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై ఉన్న అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ముందుచూపుతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ బిఆర్‌ఎస్ నాయకులు క్యామా మల్లేష్ , ఎంపిపి కృపేష్, వైఎస్ ఎంపిపి ప్రతాపరెడ్డి, వైఎస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, మున్సిపల్ అధ్యక్షులు అల్వాల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ నల్లబోలు మమత శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ వైఎస్ చైర్మన్ కల్వకోలు రవిందర్‌రెడ్డి, రైతుబంధు కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, డైరెక్టర్ కిరణప్పా, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ యూసుఫ్, భర్తకి రాజు, ముజెకీర్, కానుగుల మహేష్ తదితతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News