Sunday, September 15, 2024

విద్యార్థినిపై ఎన్‌సిసి ఆఫీసర్ అత్యాచారం…. ఏడుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఎనిమిదో తరగతి విద్యార్థినిపై ఎన్‌సిసి ఆఫీసర్ అత్యాచారం చేశాడు. ఈ అఘాయిత్యాన్ని బయటకు తెలియకుండా స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ తో సహా ఐదుగురు దాచిపెట్టడంతో వారిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎన్‌సిసి క్యాంపు కోసం 16 మంది విద్యార్థులను ఆగస్టు 8న ఎన్‌సిసి ఆఫీసర్ శివరామన్ తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో స్కూల్ ఆడిటోరియంలో నిద్రిస్తున్న ఎనిమిదో తరగతి బాలికను బయటకు తీసుకెళ్లి ఆమెపై ఎన్‌సిసి ఆఫీసర్ అత్యాచారం చేశాడు. దీంతో బాలిక ప్రిన్సిపాల్ సతీష్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో ఎవరికీ చెప్పవద్దని ఆమెను మందలించాడు. ఎన్‌సిసి క్యాంపు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లిన తరువాత బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలించారు.

తనపై అత్యాచారం జరిగిన విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎన్‌సిసి ఆఫీసర్ శివరామన్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ విషయం దాచిపెట్టినందుకు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ మరో ఐదుగురిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యారినిపై సామూహిక అత్యాచారం చేసి చంపేసిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలు, నర్సులకు రక్షణ కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళ రక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకరావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్ సిసి అధికారులు పలువురు విద్యార్థినిలను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని సిఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News