Saturday, November 2, 2024

ఎన్‌సిపి నేత దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ఎన్‌సిపి నేత దారుణ హత్యకు గురయ్యారు. ఎన్‌సిపి(అజిత్ పవార్ పార్టీ) నాయకుడు సచిన్ కుర్మీ శుక్రవారం రాత్రి ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ హత్య ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News