Monday, November 4, 2024

ఎన్‌సిపి నేత బాబా సిద్ధిక్‌ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

నేషనలిస్ట్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు బాబా సిద్ధిక్‌ను దారుణంగా హత్యకు గుయ్యాడు. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హిందీ చిత్ర పరిశ్రమలో సంబంధాలున్న సిద్దిక్‌ను విజయ దశమి రోజున బాంద్రాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. దాడికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

“ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు చీఫ్ నాకు చెప్పారు. ఒకరు యూపీ, మరొకరు హర్యానా. మూడో దుండగుడు పరారీలో ఉన్నాడు కానీ పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు”అని ముఖ్యమంత్రి చెప్పారు. నిందితులపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News