Friday, May 3, 2024

బిసిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి: సిపిఐ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బిసిల రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని తీర్మానం చేశామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా వెల్లడించారు. బిసిలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా గణనలో కులగణన చేయాలని కోరుతూ అందుకు సిపిఐ పార్టీ మద్దతు ఇవ్వాలని ఆదివారం ముక్దుంభవన్‌లో సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి రాజాను జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బిసి ప్రతినిధులు కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ దేశంలో 50 శాతం జనాభా గల బిసిలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు, ప్రజాస్వామ్య వాటా ఇవ్వాలని, అందుకోసం సిపిఐ పూర్తి మద్దతు ఇస్తుందని, పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో బిసి సంఘాల ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, కోలా జనార్ధన్, రాజేందర్, భుపేష్‌సాగర్, అంజి, మల్లేష్‌యాదవ్, శివ, మధుసూదనరావు, నికిల్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్ల ఇవే..
*పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.
*కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణన చేపట్టాలి.
*బిసి ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి.
*బిసిల విద్య,ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ను తొలగించాలి.
*కేంద్ర విద్య,ఉద్యోగ రిజర్వేషన్లను బిసిల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతంకు పెంచాలి.
*బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బిసిల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను అమలు చేయాలి.
*పంచాయతీరాజ్ సంస్థలో బిసి రిజర్వేషన్లను 50 శాతం పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి.
*ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ తరహాలో బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బిసి చట్టం తీసుకరావాలి.
*ప్రైవేట్ రంగంలో ఎస్సీ/ఎస్టీ/బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటితో పాటు పలు డిమాండ్లను బిసి సంఘాల     ప్రతినిధులు ప్రస్తావించారు.

Needs 50% reservation for BCs in legislature:CPI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News