Monday, May 6, 2024

రాహుల్‌ గాంధీ కలియుగ రావణుడి ఫోటో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాలలో బిజెపి, కాంగ్రెస్ మధ్య ఎన్నికల కాక ఇప్పుడు ముందుగా పోస్టర్‌వార్‌గా తలెత్తింది. అధికార బిజెపి గురువారం సామాజిక మాధ్యమం xలో తమ ప్రత్యర్థి రాహుల్ గాంధీని కలియుగ రావణుడుగా పోలుస్తూ ఓ కట్టుడు చిత్రం వెలువరించింది. అయితే అంతకు ముందు రోజు బుధవారం కాంగ్రెస్ పార్టీ మోడీని ఉద్ధేశించి వెలువరించిన బడా ఝూటావాలా, ఎన్నికల సభలకు దూసుకువస్తున్న జుమ్లాబాబు అనే పేరిట వెలిసిన ఎక్స్ పోస్టర్లకు ప్రతిగా బిజెపి ఈ కలియుగ రావణ పోస్టరు తీసుకువచ్చింది. మీరు ఒక్కటంటే మేం పదంటాం అని ఎదురుదాడికి దిగింది. ఇప్పుడు బిజెపి తీసుకువచ్చిన కలియగరావణుడు పోస్టరులో మధ్యలో రాహుల్ చుట్టూ పలు తలలు ఉండటం కింద భారత్ ప్రమాదంలో పడిందని పేర్కొనడం, కాంగ్రెస్ నిర్మాణం, దర్శకత్వం జార్జి సోరోస్ అని పేర్కొంది.

ఈ దశలో రాహుల్‌ను అనేక విధాలుగా ఈ పోస్టరులో సంబోధించారు. దుష్టశక్తి, అధర్మ, రాముడి విరోధి, భారత్ వినాశనకర్త అని తిట్టిపోశారు. బిజెపి తీసుకువచ్చిన పోస్టరుపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. రాహుల్‌కు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే విధంగా ఈ చర్య ఉందని తెలిపారు. బిజెపి పోస్టరుకు కౌంటర్‌గా యువజన కాంగ్రెస్ ఓ పోస్టరు విడుదల చేసింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ పేరిట వెలువడ్డ పోస్టరులో మోదీని ఉద్ధేశించి మోదానవ్ అనే పోస్టరు తెచ్చారు. దుష్టుడు, అప్రజాస్వామికుడు, రాజ్యాంగ వ్యతిరేకి, ప్రజావిరోధి, భారత్ విచ్ఛిన్నకుడు, ఇండియా ఆదర్శాలను హరించే వాడు అని ఇందులో వ్యాఖ్యానాలు జోడించారు. ఇక ఈ పోస్టరుకు చివరిలో భారత్ జుమ్లేబాజ్ పార్టీ నిర్మాణం, దర్శకత్వం పరమ్‌మిత్ర అదానీ అని తోకలు తగిలించారు. రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు రెండు నెలల్లో జరుగుతాయి. వచ్చే ఏడాది పెద్ద పెట్టున లోక్‌సభ ఎన్నికల ఘట్టం ఉంది. దీనికి ముందుగానే జోరుగా ఎన్నికల వేడిరగులుకుందని విశ్లేషకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News