Saturday, December 2, 2023

తెలంగాణ ప్రభుత్వ విధానాల వల్లే కొత్త పరిశ్రమలు

- Advertisement -
- Advertisement -

నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం సరళీకృత విధానాల ద్వారా కొత్త పారిశ్రామిక సంస్థల స్థాపనకు అనేక రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వివరించారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రం లో ఎన్.ఆర్.ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం” కార్యక్రమాన్ని శాసన సభ్యులు నోముల భగత్,రవీంద్ర కుమార్,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ,మున్సిపల్ చైర్మన్ ఎం. సైది రెడ్డి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు..ఈ సందర్భంగా ముఖ్య అతిథి గా పాల్గొన్న నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. 2014 ముందు కరెంటు కష్టాలతో అనేక పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ పరిశ్రమలు మూతపడ్డాయని,కార్మికులు రోడ్డున పడి ఉపాధి కోల్పోయారని ఆయన తెలిపారు.

కానీ నేడు 24 గంటలు కరెంట్ సరఫరాతో చేనేత పవర్ లూం పరిశ్రమలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.రాష్ట్రం ఏర్పాటు తర్వాత టి.ఎస్. ఐ పాస్ చట్టం కింద నల్గొండ జిల్లాలో కొత్తగా 608 పరిశ్రమలు స్థాపించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో గత పాలకుల కాలంలో పరిశ్రమలు స్థాపించాలన్నా పెట్టుబడులు పెట్టాలన్న ముందుకు రాలేదని ఆయన అన్నారు. కానీ నేడు ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 వేల కంపెనీలు,పారిశ్రామిక సంస్థలు తెలంగాణకు వచ్చాయని 35 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగం లో తెలంగాణ రాష్ట్రం ప్రగతి లో వుందని తెలిపారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండి కడుపు నింపుతూ భరోసాను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. నేత కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఐదు లక్షల బీమా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని వర్గాల ప్రజలకు పరిశ్రమల స్థాపనలో భాగంగా విద్యుత్తును సబ్సిడీపై అందిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఐటి టవర్ ను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేటీఆర్ సహకారంతో కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధికి విద్యుత్ ప్రధానమైనది అన్నారు. మరి ఆ విద్యుత్ 24 గంటలు ఇచ్చి పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి కేసిఆర్ కృషి చేశారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడం వలన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు గూగుల్, ఆపిల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మొదలగునవి మన రాష్ట్రానికి వచ్చాయని ఆయన తెలిపారు. మన నల్లగొండ జిల్లాలో గతంలో పరిశ్రమల స్థాపనకు అనుమతుల గురించి అనేక శాఖల చుట్టూ తిరిగేవారని, కానీ నేడు టిఎస్ ఐపాస్ ద్వారా ఆన్లైన్లో అనుమతులు ఇచ్చి పరిశ్రమల స్థాపన కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పరిశ్రమల స్థాపనతో పాటు అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ సంస్థలు టీఎస్ ఐపాస్ ఆన్లైన్ ద్వారా పారిశ్రామిక సంస్థలు అనుమతులు తీసుకొని తమ సంస్థలను స్థాపించాయని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లాలో 608 పరిశ్రమలు స్థాపించగా 28,689 కోట్ల పెట్టు బడి తో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ఆయన వివరించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో టీఎస్ ఐపాస్ అనేది దేశంలోనే ఒక గొప్ప విధానం అని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన వెంటనే 15 రోజులలో ఆ దరఖాస్తుకు అనుమతులు మంజూరు చేస్తామని ఆయన వివరించారు. టీఎస్ టీ ప్రైడ్ ద్వారా సబ్సిడీతో యువతీ యువకులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. చేనేత కార్మికులు విధిగా చేనేత భీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రూరల్ ఇన్నోవేటర్స్ ను ప్రభుత్వము ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.

చివరిలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు, ఇన్నోవేటర్లకు సన్మానం చేశారు. కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల శాఖ,చేనేత, జౌళి శాఖ తమ ఉత్పత్తు లపై ఎగ్జిబీషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అర్.మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎం. సై ది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,ఎం.పి.పి.లు విజయలక్ష్మి, కరీం పాషాలు,పరిశ్రమల శాఖ జి.యం.కోటేశ్వర రావు,చేనేత,జౌళి శాఖ ఏ.డి. ద్వారక్,వంగాల సహదేవ రెడ్డి, జిల్లా బిక్షం, పున్న గణేష్, పూజిత శ్రీనివాస్, మిర్యాల యాదగిరి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News