Thursday, April 18, 2024

పేగు క్యాన్సర్ రిస్కు తగ్గించే కొత్త ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

పేగు క్యాన్సర్‌తో బ్రిటన్‌లో ప్రతి 30 నిముషాలకు ఒకరు చనిపోతున్నారు. ఇంత తీవ్రమైన పరిస్థితిని తగ్గించడానికి శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రయత్నంలో కొత్త మలుపు కనిపించింది. సాధారణంగా పేగు క్యాన్సర్ సర్జరీ జరిగిన తరువాత ఇంకా ఏవైనా క్యాన్సర్ కణాలు మిగిలిపోయి ఉంటే తిరిగి క్యాన్సర్ పుట్టుకు వచ్చే ప్రమాదం ఉన్నందున వాటిని నిర్మూలించడానికి కీమోథెరపీ ఇస్తుంటారు. అయినా సరే ప్రతి ముగ్గురిలో ఒకరికి మళ్లీ క్యాన్సర్ కనిపిస్తోంది.

ఈ సంఖ్య రానురాను ఎక్కువౌతోంది. దీంతో కొన్నేళ్లు చికిత్సలో కొత్త విధానం ఏదైనా దొరుకుతుందా అని వైద్యనిపుణులు అన్వేషించారు. చివరికి వారికి ఒక పరిష్కారం దొరికింది. క్యాన్సర్ రోగులకు సర్జరీ తరువాత కీమోథెరపీ చేయడం కన్నా సర్జరీకి ముందే చేస్తే క్యాన్సర్ మళ్లీ వచ్చే రిస్కు 28 శాతం వరకు తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈమేరకు బ్రిటన్‌లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో పేగు క్యాన్సర్ ప్రారంభం లోనే గుర్తించి కీమోథెరపీ ఇస్తే చాలా వరకు మేలు జరుగుతుందని వైద్య నిపుణులు కనుగొన్నారు. ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో వెలువడింది.

ఇందులో అద్భుతమైన ఫలితాలు కనిపించడం ఆనందం కలిగించిందని బ్రిటన్ లోని బౌవెల్ (పేగు క్యాన్సర్) క్యాన్సర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెనెవీవ్ ఎడ్వర్డ్ వివరించారు. ఏటా పేగు క్యాన్సర్ ప్రారంభ దశలోని రోగుల జీవితాలకు ఇది కొత్త వెలుగు చూపిస్తుందని పేర్కొన్నారు. బ్రిటన్, డెన్మార్క్, స్వీడన్ దేశాల్లోని 85 ఆస్పత్రుల్లో మొత్తం 1053 రోగులను చేర్చుకుని ట్రయల్స్ నిర్వహించగా, సర్జరీకి ముందు ఎవరైతే కీమోథెరపీ చేయించుకున్నారో వారిలో క్యాన్సర్ రిస్కు చాలావరకు తగ్గడం కనిపించింది. ఇతర క్యాన్సర్ రోగుల్లో కూడా ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని ఆశ కలుగుతోందని బర్మింఘాం క్లినికల్ ట్రయల్స్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లారా మగిలి అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News