Monday, April 22, 2024

చెట్ల పొదల్లో శిశువు..వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భీంపూర్ మండలం లోని నిపాని గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మగ శిశువును పొదల్లో పడేసి వెళ్లారు. గురువారం తెల్లవారు జామున అటుగా వెళ్లిన కొందరు గ్రామస్థులు శిశువు ఏడుపు విన్నారు. వెంటనే శిశువును పొదల్లో నుంచి  గ్రామస్థులు బయటకు తీసి స్నానం చేయించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News