Saturday, August 2, 2025

ఫ్యాన్స్ కు షాక్.. అంతర్జాతీయ క్రికెట్ కు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ తన అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, T20 క్రికెట్ లో కొనసాగుతానని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించాడు. 29 ఏళ్ల పూరన్ ఇప్పటికే వెస్టిండీస్ తరపున అత్యధిక T20Iలు ఆడిన ఆటగాడు ఉన్నాడు. అలాగే, కరేబియన్ జట్టు తరపున అతి తక్కువ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. 2016లో వైట్-బాల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పూరన్.. వెస్టిండీస్ తరపున 61 ODIలు, 106 T20Iలు ఆడాడు. 2019లో ODI అరంగేట్రం చేసిన పూరన్ 39.66 సగటు, 99.15 స్ట్రైక్ రేట్‌తో 1983 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక, T20I లలో పూరన్ మెరుగ్గా రాణించాడు. 97 ఇన్నింగ్స్‌లలో 136.39 స్ట్రైక్ రేట్‌తో 13 యాభై-ప్లస్ స్కోర్‌లతో 2275 పరుగులు సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News