Sunday, December 15, 2024

పూరన్ అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

సెయింట్ లూసియా: ఎట్టకేలకు వెస్టిండీస్ ఓ సాధించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నాలుగో టి20లో విండీస్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఓవర్ మిగిలుండానే ఛేదించి పరువు కాపాడుకుంది. స్వదేశంలో తమ అత్యుత్తమ ఛేదనతో వెస్టిండీస్ కొత్త రికార్డును నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 218 పరుగులు చేసింది. జాకోబ్ బెతెల్ (62 నాటౌట్), ఫిలిప్ సాల్ట్ (55) అర్ధశతకాలతో సత్తాచాటారు. విల్ జాక్స్(25), సామ్ కరన్(24)లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. విండీస్ బౌలర్లలో మొటియ్ రెండు వికెట్లు, రోస్టన్ ఛేజ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 19 ఓవర్లలోనే లక్షాన్ని అందుకుంది.

ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (68), షై హోప్ (54) విధ్వంసకర బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ నిర్ధేశించిన లక్షం చిన్నదైంది. కెప్టెన్ పావెల్ (38), ఫెర్పేన్ రూథర్‌ఫర్డ్ (29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు వికెట్లు తీశారు. అయితే ఛేదనలో తొలి రెండు ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు 5/0 మాత్రమే. కానీ ఆ తర్వాత లూయిస్-, హోప్ విజృంభించడంతో సమీకరణం మారిపోయింది. కాగా, సొంతగడ్డపై వెస్టిండీస్‌కు పరుగుల పరంగా ఇదే అత్యుత్తమ ఛేదన. అంతకుముందు 2017లో భారత్‌పై ఛేజింగ్ చేసిన 191 పరుగులే అత్యుత్తమం. కాగా, ఈ సిరీస్‌లో విండీస్ తొలి మూడు టి20ల్లో ఓడటంతో ఇప్పటికే 31 సిరీస్ కోల్పోయింది.

పూరన్ అరుదైన రికార్డు

పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. విండీస్ తరఫున అత్యధిక టి20లు ఆడిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టి20తో ఈ ఘనత అందుకున్నాడు. 29 ఏళ్ల పూరన్ 2016లో అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 102 మ్యాచ్‌లు ఆడాడు. 26.83 సగటుతో, 137 స్ట్రైక్‌రేటుతో 2254 పరుగులు చేశాడు.పూరన్ కంటే ముందు ఈ రికార్డు ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ పేరిట ఉండేది. వెస్టిండీస్ తరఫున పొలార్డ్ ఇప్పటి వరకూ 101 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 1569 పరుగులు, 42 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో డ్వెన్ బ్రావో (91), కెప్టెన్ పావెల్ (87 ), రసెల్ (83), క్రిస్ గేల్ (79) మ్యాచ్‌లు ఆడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News