Sunday, August 3, 2025

ప్రార్థనా మందిరంలో తొక్కిసలాట: 31 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Nigeria stampede: 31 killed

నైజీరియా: దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్‌కోర్ట్‌ సిటీలోని చర్చిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 31 మందికిపైగా మరణించారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం చర్చి దగ్గర నిర్వహించిన చారిటీ ఈవెంట్‌లో భాగంగా ఆహార పదార్థాలు, కానుకలు పంపిణీ చేశారు. ఫ్రీ అనగానే పెద్ద సంఖ్యలో ప్రజలు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని రివర్స్ స్టేట్ పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఆఫ్రికాలో అత్యధికంగా ముడి చమురును ఉత్పత్తి చేస్తున్న, జనాభా కలిగిన దేశాల్లో నైజీరియా ఒకటి అన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News