Monday, May 20, 2024

నీలోఫర్ ఆస్పత్రి డైట్ కాంట్రాక్టర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Niloufer Hospital Diet Contractor Arrested

నకిలీ బిల్లులతో రూ.1.20కోట్లు ఛీటింగ్

మనతెలంగాణ, హైదరాబాద్ : నకిలీ బిల్లులు పెట్టి మోసం చేసిన నీలోఫర్ ఆస్పత్రి డైట్ కాంట్రాక్టర్‌ను నగర సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కోడూరి సురేష్‌బాబు నీలోఫర్ ఆస్పత్రిలోని రోగులకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్నాడు. సాధారణ ఆహారం పెడుతూ ప్రొటీన్ డైట్ ఇస్తున్నట్లు నకిలీ బిల్లులు పెట్టి రూ.1.20కోట్లు తీసుకున్నాడు. రోజు రోగులకు సరఫరా చేసేదానికంటే ఎక్కువ మందికి ఆహారం సరఫరా చేస్తున్నట్లు బిల్లులు సృష్టించాడు. వాటి ద్వారా డబ్బులు డ్రా చేసి తీసుకున్నాడు. ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న నగర సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News