Tuesday, October 15, 2024

నిఫా వల్లనే మలప్పురం యువకుని మృతి : మంత్రి వీణాజార్జి

- Advertisement -
- Advertisement -

మలప్పురం ప్రైవేట్ ఆస్పత్రిలో ఇటీవల 24 ఏళ్ల యువకుడు నిఫా వైరస్ వల్లనే మృతి చెందాడని బయటపడినట్టు కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జి ఆదివారం వెల్లడించారు. నిఫా వైరస్‌పై అనుమనాలు ఆ మరణం తరువాత , రీజినల్ మెడికల్ ఆఫీసర్ పరిశీలనకు దారి తీసిందని చెప్పారు. పరీక్షకు వెంటనే పంపిన నమూనాలు తిరిగి పాజిటివ్‌గా వచ్చాయని చెప్పారు. మలప్పురంకు చెందిన ఆ యువకుడు బెంగళూరు నుంచి వచ్చిన తరువాత సెప్టెంబర్ 9న చనిపోయాడు. ఆ తరువాత ఆయన నమూనాలు కొజికోడ్ మెడికల్ కాలేజీకి పరీక్షకు పంపగా, ఫలితాలు పాజిటివ్ అని తేలింది. దాంతో శనివారం రాత్రి రాష్ట్ర ఆరోగ్య మంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం నిబంధనలను అమలు చేయడం ప్రారంభించారు. ఈలోగా పుణె లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వచ్చిన ఫలితాలు వైరస్‌ను నిర్ధారించాయి.

శనివారం రాత్రి 16 కమిటీలను ఏర్పాటు చేయడమైందని, వైరస్ సోకిన వ్యక్తితో చేరువగా ఉన్న 151 మందిని గుర్తించి జాబితా తయారు చేయడమైందని మంత్రి తెలిపారు. బాధితుడు తన స్నేహితులతో కలిసి అనేక ప్రదేశాలు సంచరించాడని, ఆయా సన్నిహితులను ఒంటరి చేయడమైందని చెప్పారు. ఐసొలేషన్‌లో ఉన్న వారిలో ఐదుగురిలో స్వల్పంగా జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయని వారి నమూనాలు పరీక్షకు పంపామని మంత్రి వివరించారు. మలప్పురంకు చెందిన ఒక బాలుడు నిఫా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ జులై 21న చనిపోయాడు. అదే ఈ ఏడాదిలో రాష్ట్రంలో మొదటి నిఫా వైరస్ కేసు. కొజికోడ్ జిల్లాలో 2018. 2021. 2023 లలో నిఫా వైరస్ వ్యాపించింది. ఎర్నాకులం జిల్లాలో 2019లో బయటపడింది. కొజికోడ్, వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకులం జిల్లాల్లో గబ్బిలాల్లో నిఫా వైరస్ యాంటీబాడీలు ఉన్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News