Saturday, April 27, 2024

కాంగ్రెస్ ఎంపీపై నిర్మలా సీతారామన్ ఫైర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఇదే కొనసాగితే దేశ విభజన తథ్యమని, దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటు డిమాండ్ పెరుగుతుందని కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డికె.సురేశ్ చేసిన వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె నిధుల కేటాయింపుపై వివిరణ ఇచ్చారు.

‘‘నిధుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి కట్టుబడి ఉంది. దాని పాత్ర అంత వరకే. ఒకవేళ నిధులు కావాలంటే రాష్ట్రాలు.. ఫైనాన్స్ కమిషన్ కు  విన్నవించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నిధులు మంజూరు అవుతాయి. దక్షిణాది రాష్ట్రాలను వేరుగా పరిగణించలేము. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ సరైనది కాదు. అది ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది’’ అని నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై ఇటీవల పార్లమెంట్ లో గోలగోల అయింది. డికె. సురేశ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ ‘ దేశాన్ని ఒక్కటిగా ఉంచాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతమని, విభజన కోరే వారికి పార్టీ ఎప్పటికీ మద్దతు తెలుపదని’ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News