Sunday, April 28, 2024

శ్రీనగర్ నిట్‌కు పది రోజులు ముందే శీతాకాల సెలవులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అధికారులు శీతాకాలపు సెలవులకు పది రోజుల ముందే మూసి వేశారు. విద్యాసంస్థలోని ఓ విద్యార్థి సోషల్ మీడియాలో ఉంచిన పోస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఇతర విద్యాసంస్థలకు వ్యాపించడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. కాగా మరో వైపు ఇస్తామిక్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ గురువారం జరగాల్సిన అన్ని క్లాస్‌వర్క్‌లు, ఇంటర్నల్ ఎగ్జామినేషన్లను రద్దు చేసింది. శ్రీనగర్ నిట్ గురువారం సెలవు డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఈ రోజునుంచే శీతాకాలపు సెలవులను ప్రకటిస్తూ ఒక సర్కులర్‌ను జారీ చేశారు. అంతేకాదు హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు వెంటనే హాస్టల్‌ను ఖాళీ చేయాలని కూడా ఆ సర్కులర్‌లో పేర్కొన్నారు. శీతాకాలపు సెలవులను మాత్రమే పది రోజులు ముందుకు జరిపామని, దీనివల్ల విద్యార్థులకు చదువు ఏ విధంగాను నష్టం కాదని సంస్థ రిజిస్ట్రార్ తెలిపారు.

ప్రస్తుతం విద్యార్థులకు జరుగుతున్న పరీక్షల గురించి అడగ్గా వాళ్ల్లు సెలవులనుంచి తిరిగి వచ్చిన తర్వాత మిగతా పేపర్లు రాస్తారని ఆయన చెప్పారు. ఒక వర్గం మత మనోభావాలను గాయపరుస్తూ ఓ విద్యార్థి సోషల్ మీడియాలో ఉంచిన పోస్టుపై మంగళవారం శ్రీనగర్ నిట్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. సెలవుపై పంపించిన ఆ నాన్ లోకల్ విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ విద్యార్థిపై కేసు కూడా నమోదు చేశారు. మెయింటెనెన్స్ పేరుతో నిట్ వెబ్‌సైట్‌ను కూడా మూసివేశారు. కాగా బుధవారం దీనిపై అమర్‌సింగ్ కాలేజిలో కూడా నిరసనలు జరిగాయి. దీంతో నిట్‌కు పది రోజుల ముందే శీతాకాల సెలవులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News