Friday, March 29, 2024

ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ‘క‌బ్జ’ తెలుగు రిలీజ్

- Advertisement -
- Advertisement -

ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జ’. పాన్ ఇండియా రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది.

Nithiin Releasing Upendra Kabzaa In Teluguఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘క‌న్న‌డ చిత్రాలు కె.జి.య‌ఫ్‌, 777 చార్లి, విక్రాంత్ రోణ‌, కాంతార సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అంతే ఎగ్జ‌యిట్‌మెంట్‌ని క్రియేట్ చేసిన మ‌రో క‌న్న‌డ చిత్రం ‘కబ్జ’. తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో అభిమానించే ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌టం విశేషం. ఈ సినిమాను తెలుగులో రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ విడుద‌ల చేస్తుండ‌టం హ్య‌పీగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో క‌బ్జ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. ఆర్‌.చంద్రుగారు ఒక్కో ఫ్రేమ్‌ను అద్భుతంగా తెర‌కెక్కించారు. త‌ప్పకుండా క‌బ్జ పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు.

1947 నుంచి 1984 కాలంలో న‌డిచే క‌థ‌. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు కొడుకు మాఫియా వ‌రల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. త‌ర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడ‌నే క‌థాంశంతో క‌బ్జ‌ సినిమాను తెర‌కెక్కించారు. కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. శ్రియా శ‌ర‌న్‌, కిచ్చా సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాష్ రాజ్‌, సముద్ర‌ఖ‌ని, ముర‌ళీ శ‌ర్మ‌, న‌వాబ్ షా, క‌బీర్ దుహాన్ సిఒంగ్‌, ద‌నీష్ అక‌ర్త ష‌ఫి, ప్ర‌దీప్ సింగ్ రావ‌త్‌, కృష్ణ ముర‌ళి పోసాని, ప్ర‌మోద్ శెట్టి, అనూప్ రెవ‌న‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News